- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇంకా ఎందుకు ప్రారంభించలేదని ఆయన ప్రశ్నించారు. దళారుల చేతుల్లోకి పత్తి వెళ్లాలనే దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టలేదని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యమైతే ఏం జరుగుతుందో ప్రభుత్వ పెద్దలకు తెలియదా?.. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా పెడితే పత్తి రైతులు బాగా నష్టపోతారని మండిపడ్డారు.
పత్తి రైతు నిల్వ ఉంచుకోలేడని తెలిసే ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. విధి లేని పరిస్థితుల్లో పత్తిని తక్కువ ధరకే రైతులు అమ్ముకుంటున్నారని.. ఇకనైనా ప్రభుత్వం మేలుకోవాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
- Advertisement -