Monday, December 23, 2024

20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Niranjan Reddy Speech on Oil Farming in Assembly

హైదరాబాద్: పంటల మార్పిడి విధానంలో భాగంగా ఆయిల్ పామ్ ను ప్రోత్సహిస్తున్నామని, 20లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. సోమవారం శాసనసభలో సభ్యులు బాల్క సుమన్, సండ్ర వెంకటవీరయ్య, అంజయ్య యాదవ్, గండ్ర వెంకటరమణా రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమాధానం ఇస్తూ..”తెలంగాణ ప్రభుత్వం 26 జిల్లాలలో ఆయిల్ పామ్ పండించే విస్తీర్ణాన్ని విస్తరించడానికి 11 కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్లను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంననుసరించి, తమకు కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లలో రైతులకు సరఫరా చేయడం కోసం ఆయిల్ పామ్ విత్తనాలను పెంచడానికి కేటాయించిన కంపెనీ నర్సరీలను ఏర్పాటు చేయాలి. ప్రతీ సంవత్సరం 2.25 కోట్ల పిలక మొక్కలను పెంచడానికి రాష్ట్రమంతటా కంపెనీలు ఇప్పటి వరకు 29 నర్సరీలను ఏర్పాటు చేశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, అప్పారావు పేటల వద్ద ప్రతి ఒక్క గంటకు 30 ఎం.టీ.ల సామర్థ్యంతో మెస్సర్స్ టీఎస్ ఆయిల్ ఫెడ్ రెండు ప్రాసెసింగ్ యూనిట్లను నడుపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం, కేటాయించిన జిల్లాలో మొదటిసారి మొక్కలు నాటిన 36 నెలలలోపు ఫ్యాక్టరీ జోనులో పూర్తిస్థాయి నిర్వహణ ప్రాసెసింగ్ యూనిట్న కేటాయించిన కంపెనీలు ఏర్పాటు చేసి ప్రారంభిస్తాయి. అంతేకాక, అవసరం మేరకు ఎప్పటికప్పుడు సిపిఓ యూనిట్, రిఫైనరీల సామర్థ్యాన్ని పెంచుతాయి.

ఆయిల్ పామ్ సాగుపై ఉద్యానశాఖ ద్వారా పెద్ద ఎత్తున రైతులను చైతన్యం చేస్తున్నాం.. ఇప్పటికే 79 క్షేత్ర పర్యటలన ద్వారా 8460 మంది రైతులకు ఆయిల్ పామ్ సాగు ఇతర విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు స్వయంగా నేను లేఖలు రాయడం జరిగింది. వరి మినహా మిగతా పంటలన్నీ ఆయిల్ పామ్ తోటలలో అంతర పంటలుగా సాగుచేయొచ్చు. ఆయిల్ పామ్ మొక్కల పెంపకం 14 నుండి 16 నెలల ప్రక్రియ .. కోస్టారికా, మలేషియా, థాయింలాండ్ దేశాల నుండి దిగుమతి చేసుకుని నర్సరీలు ఏర్పాటు చేశాం. 2.50 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు అందించేందుకు సన్నద్దమవుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ కి చెందిన రెండు ఆయిల్ పామ్ ఫాక్టరీలు, ఒక్కొకటి 30 మె.ట. సామర్థ్యంతో (కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో ఒకటి, అప్పారావు పేటలో ఒకటి) నిర్వహణలో వున్నవి. ప్రభుత్వం, కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఆయా జిల్లాకు నిర్దేశించబడిన కంపెనీ తమ ఫ్యాక్టరీ జోన్ నందు ఆయిల్ పామ్ తోటను నాటిన 36 నెలలలో మిల్లులను ఏర్పాటుచేయవలసి వుంటుంది. అవసరాన్ని బట్టి సమయానుకూలంగా ఈ మిల్లుల సామర్థ్యం పెంచవలసివుంటుంది” అని చెప్పారు.

Niranjan Reddy Speech on Oil Farming in Assembly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News