Sunday, January 19, 2025

చైనాలోని వ్యక్తితో నిరంజన్ ఎందుకు మాట్లాడుతున్నారు: రఘునందన్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి భూమి వరకు సిసి రోడ్డు వేశారని బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ రావు విమర్శించారు. మూడు కిలో మీటర్ల రోడ్డును రైతులతో కలిసి వేసుకున్నట్టు నిరంజన్ రెడ్డి చెప్పారని, ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే సిసి రోడ్డును రైతులు చందాలు వేసుకొని నిర్మించారా? అని ప్రశ్నించారు. మంత్రి నిరంజన్ రెడ్డి కాంట్రాక్టులన్నీ దత్త పుత్రుడికి అప్పగిస్తున్నారని, నిరంజన్ రెడ్డి దత్త పుత్రుడు గౌడ నాయక్‌పై ఐటికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మంత్రి నిరంజన్ రెడ్డి సడన్‌గా ఫోన్ నంబర్ ఎందుకు మార్చారని రఘునందన్ ప్రశ్నించారు. చైనాలోని మో అనే వ్యక్తితో నిరంజన్ తరుచూ ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. అమెరికాలో వ్యాపారాలు చేసే మరో వ్యక్తితో మో సంప్రదింపులు జరిపేవారని, మో అనే వ్యక్తితో మంత్రి జరిపిన లావాదేవీలపై ఇడి విచారణ కోరుతామని రఘునందన్ స్పష్టం చేశారు.

Also Read: టీవీ నటుడు రామ్ ఆత్మహత్య..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News