Tuesday, January 21, 2025

తరుగు తీస్తే తాటతీస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: వరి కోతల ఆధారంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారని, ఎవరైనా కొనుగోలు కేంద్రాలు, మిల్లర్లు తరుగు పేరుతో మోసం చేస్తే రైస్ మిల్లర్ల లైసెన్స్ రద్దు చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రె డ్డి హెచ్చరించారు. శనివారం వనప ర్తి జిల్లా పరిధిలోని రాజపేట, పెద్దమందడి మండలం మనిగిల్ల, పెద్దమందడి, అల్వాల, చిన్నమందడి, పామిరెడ్డిపల్లి, జంగమాయపల్లి, బలిజపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఐకెపి సెంటర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సజావుగా ధాన్యం సేకరించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో భారీగా వరి పంటలు రైతులు పండించారని వనపర్తి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల పైచిలుకు వరి పంట సాగు అయిందని, 4.20 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అన్నారు.

జిల్లాలో 257 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారని, కేంద్రాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. ప్రతి సంచికి 40 కిలోలు వరి ధాన్యం తూకం పెట్టాలని ఆయన అన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికే 40వేల పైగా గన్ని బ్యాగులు వచ్చాయని మిగతా సంచులు కూడా దశల వారీగా పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి జడ్పీటీసీ రఘుపతిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు రాజప్రకాష్ రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, సింగిల్‌విండో వైస్ చైర్మన్ కుమార్ యాదవ్, మాజీ జడ్పీటీసీ వెంకటస్వామి, వనపర్తి మార్కెట్ యార్డు డైరెక్టర్ శివశంకర్, మాజీ ఎంపీపీ మన్యపు రెడ్డి, మనిగిల్ల ఉప సర్పంచ్ శ్రీనివాస గౌడ్, జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం డైరెక్టర్ నాగేంద్ర యాదవ్, పురుషోత్తం రెడ్డి, కొన్నూర్ శ్రీనివాస్‌రెడ్డి, జానకి రాములు , వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News