Monday, December 23, 2024

తెలంగాణ సాధనకు పాలమూరు ఓట్లే ఇందనం: నిరంజన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సాధనకు పాలమూరు ఓట్లే ఇందనంగా పనిచేశాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ పర్యటన సందర్భంగా జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్‌నగర్ ఎంపీగా కేసీఆర్ తెలంగాణను సాధించారని అన్నారు. ఇది పాలమూరు ప్రజలకు దక్కిన గౌరవమని అన్నారు. పాలమూరు ప్రజలు తమ కన్నీళ్లతోనే టీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుకు ఇంధనంగా మార్చి కేసీఆర్‌ను డిల్లీకి ఎంపీగా పంపించారని తెలిపారు. బూర్గుల రామకృష్ణారావు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రాలో విలీనం అయ్యిందని, కేసీఆర్ మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం సాధించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చేపట్టారన్నారు. విపక్షనేతలు కొందరూ కారుకూతలు కూస్తూ మొరుగుతున్నారని విమర్శించారు. కొందరూ కిరాయి సైన్యాలతో ప్రజలు తమ వెంటే ఉన్నారని భ్రమ పడుతున్నారని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లాలో 25లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పంటల సాగుతో ప్రతి చేతికి పని కల్పించబడిందన్నారు. జిల్లాలో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని నియోజకవర్గాలకు రూ.15కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయడం అసాధారణమని అన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లు కూడా జిల్లాకు అధనంగా ఇస్తామని చెప్పడం సంతోషకరమని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News