ధాన్యం కొనుగోళ్లపై
నేడు ప్రధాని మోడీని కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం : సహచర మంత్రులతో ఢిల్లీకి వెళ్తూ నిరంజన్‌రెడ్డి
మనతెలంగాణ/హైదారబాద్ : ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంతో అమితుమీ తేల్చుకోనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. శనివారం సహచర మంత్రులు గంగుల కమాలకర్ , పువ్వాద అజయ్‌కుమార్ , వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కలిసి నిరంజన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడిని కలిసేందుకు అధికారుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.
వానాకాలం రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోళ్లకు సబంధించి అదనపు కొనుగోలుకు ఇప్పటివరకూ కేంద్రం ఆమొదం తెలపలేదన్నారు. యాసంగిలో వరిధాన్యం విషయంలో రా రైస్ , బాయిల్డ్ రైస్ అంటూ కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటనలతో పార్లమెంట్ సాక్షిగా ద్వంద విధానాలు అవలంబిస్తోందన్నారు. తెలంగాణలో యాసంగి సీజన్లో పండే ధాన్యం ఉడికించిన బియ్యానికి మాత్రమే పనినికి వస్తాయని తెలిసి కూడా బిజేపి నేతలు రైతుల ప్రయోజనాల కన్న రాజకీయ ప్రయోజనాలనే ఆశిస్తున్నారన్నారు. రాష్ట్ర బిజేపి నేతల అసమర్ధత ,కేంద్రం సవతితల్లి ప్రేమ కారణంగా తెలంగాణ రైతులు సతమతమవుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో చర్చలు జరిపిందేకు ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.