Saturday, November 2, 2024

పిలిస్తే పలికే దైవం నిరంజన్ షావలివరుడు

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట: అచ్చంపేట మండలంలోని నిర ంజన్ షావలివరుడుని నియోజకవర్గ ప్రజలతో పాటు భక్తులు నిరంజన్ షావలిని పిలిస్తే పలికే దైవంగా భావించి, భక్తులు కోరిన కోరికలు తీర్చడం ద్వారా మొక్కుబడులు భక్ది శ్రద్ధలతో చెల్లించుకుంటారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగం గా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగాపూర్ గ్రా మంలోని నిరంజన్ షావలి దర్గా వద్ద కమిటీ సభ్యులు స్వాగతించగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగాపూర్ గ్రా మంలో వెలిసిన నిరంజ్ షావలివరుడు, ఉమామహేశ్వరంలో వెలిసిన ఉమామహేశ్వరుడు ఈ రెండు ప్రసిద్ధిగాంచిన దివ్య క్షేత్రాలుగా మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయని అన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక శోభకు పెద్దపీట వేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలు కోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి దర్గాలతో పాటు ఆలయాలను పునరుద్ధరించుకోవడం జరిగిందని ఎమ్మెల్యే సూచించారు.

తెలంగాణ ప్రభుత్వ నినా దం సామాజిక న్యాయమని, ఎమ్మెలే గుర్తు చేశారు. మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో అపర భగీరథుడు సిఎం కెసిఆర్ రూపకల్పన చేసిన ఎన్నో సంక్షేమ పథకాలే అధికారంలోకి వచ్చే విధంగా దోహదపడుతాయని తద్వారా రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ఉమ్మడి మండలాలైనా అమ్రాబాద్, పదర మండలాలకు రిజర్వాయర్ల ద్వారా కృష్ణా జలాలను నల్లమల ప్రాంతంలో పారిం చి సాగునీరు, తాగునీరు అందించడంతో పాటు కృష్ణా జలాలతో రైతుల పాదాలను కడుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పోకల మనోహర్, సీనియర్ నాయకుడు రాజేశ్వర్ రెడ్డి, రంగాపూర్ సర్పంచ్ లోక్య నాయక్, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News