Monday, December 23, 2024

నీరవ్ మోడీ, మాల్యా పరారీకి దర్యాప్తు సంస్థలే కారణం:

- Advertisement -
- Advertisement -

నీరవ్ మోడీ, మాల్యా పరారీకి దర్యాప్తు సంస్థలే కారణం
ప్రత్యేక కోర్టు సంచలన వ్యాఖ్యలు

ముంబై: సరైన సమయంలో దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయకపోవడం వల్లే కోట్లాది రూపాయల ఆర్థిక కుంభకోణాలకు పాల్పడిన నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా లాంటి నిందితులు దేశం విడిచి పారిపోగలిగారని ఒక ప్రత్యేక కోర్టు వ్యాఖ్యానించింది. మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న వ్యోమేష్ షా అనే వ్యక్తి తన బెయిల్ షరతులను సవరించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రత్యేక న్యాయమూర్తి ఎంజి దేశ్‌పాండే ఇటీవల ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరంటూ విధించిన షరతును తొలగించాలని కోరుతూ వ్యోమేష్ షా దాఖలు చేసిన పిటిషన్‌ను మే 29న ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి ఉత్తర్వులు సోమవారం అందుబాటులోకి వచ్చాయి.

వ్యోమేష్ షాకు అనుమతిస్తే నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ పరిస్థితులు ఎదురవుతాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఈ సందర్భంగా వాదించింది. ఇడి వాదనపై న్యాయకూర్తి అభ్యంతరం తెలిపారు. ఈ వాదనపై తాను తీవ్రంగా ఆలోచించానని, సరైన సమయంలో అరెస్టు చేయకపోవడం వల్లనే ఆర్థిక కుంభకోణాలకు పాల్పడిన నీరవ్ మోడీ, మోహెల్ చోక్సీ, విజయ్ మాల్యా దేశం విడిచి పోరిపోయానని తాను భావిస్తున్నానని న్యాయమూర్తి అన్నారు. సమన్లకు స్పందించి కోర్టుకు హాజరైన షాకు బెయిల్ లభించిందని, విదేశాలకు వెళ్లేందుకు ఆయన పలుసార్లు దరఖాస్తు చేసుకున్నారని న్యాయమూర్తి పేర్కొన్నారు.

షా కేసును నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ కేసులతో పలోల్చకూడదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కోట్లాది రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ ప్రధాన నిందితులు. నీరవ్ మోడీ ప్రస్తుతం బ్రిటన్‌లో జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. చోక్స ఆంటిగ్వాలో తలదాచుకున్నాడు. రూ. 900 కోట్ల మేరకు బ్యాకు రుణాన్ని ఎగవేసిన కేసులో నిందితుడైన విజయ్ మాల్యా లండన్‌లో ఉంటున్నాడు. ఈ కేసును ఇడి, సిబిఐ దర్యాప్తు చేస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News