ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్‌బి)ని మోసగించి రూ. 13,500 కోట్ల మేరకు ముంచేసిన నిందితుడు, నీరవ్ మోడీ సన్నిహితుడు అయిన మాజీ ఉద్యోగి సుభాష్ శంకర్ పరబ్‌ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అరెస్ట్ చేసింది. అతడు బ్యాంక్ కుంభకోణం వెలుగుచూడగానే 2018 మొదట్లో దేశం వదిలి పారిపోయాడు. కాగా సిబిఐ అతడిని కైరో నుంచి పట్టుకుని దేశానికి తీసుకొచ్చింది. 50 ఏళ్ల పరబ్ ఇదివరలో నీరవ్ మోడీకి చెందిన ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్(ఎఫ్‌ఐపిఎల్)లో ఉద్యోగిగా పనిచేసేవాడు. 2018 జులైలో అతడిపై నీరవ్ మోడీతోపాటు ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్‌లు జారీచేసింది. నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం, మోసం, ప్రాపర్టీని డెలివరీ చేయడంలో నిజాయితీలేకపోవడం వంటి ఆరోపణల కింద నోటీస్ జారీచేసింది. దర్యాప్తు అధికారుల ప్రకారం పరబ్ ఆరు హాంకాంగ్ కంపెనీల నుంచి వచ్చేపోయే లావేదేవీలకు ఇన్‌ఛార్జీగా ఉండేవాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నీరవ్ మోడీకి ఇచ్చిన లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్స్(ఎల్‌ఓయూల) ద్వారా అతడు రూ. 8,200 కోట్లు అందుకున్నారు.
నీరవ్ మోడీ ఆయన అంకుల్ మెహుల్ ఛోక్సీ ఆర్థిక నేరస్థులుగా ప్రకటించబడ్డారు. కాగా ప్రస్తుతం నీరవ్ మోడీ యూకె జైలులో ఉన్నాడు. కాగా ఛోక్సీ ప్రస్తుతం అంటిగ్వా అండ్ బర్బుడాలో ఉన్నాడు.
కైరోలో నీరవ్ మోడీ సహచరుడు సుభాష్ పరబ్ అరెస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -