లఖ్‌నవూ: 2012 నాటి నిర్భయ కేసుతోపాటు గత ఏడాది హత్రాస్ కేసులో బాధితుల తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన లాయర్ సీమా కుశ్వాహా గురువారం బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఆమెతోపాటు మరో లాయర్ సామ్రాట్ సుజీత్ కూడా బిఎస్పీలో చేరారు. ఉత్తరప్రదేశ్ బీఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా సమక్షంలో వీరిద్దరూ అధికారికంగా బిఎస్పీ సభ్యత్వం తీసుకున్నారు. సీమా కుశ్వాహా చేరిక బీఎస్పీకి మరింత బలాన్ని ఇస్తుందని, భావిస్తున్నారు. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ పనితీరుపై వీరు ప్రశంసలు కురిపిస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లో మహిళలు సురక్షితంగా ఉండాలంటే బీఎస్పీ అధికారం లోకి రావాలని బిఎస్పీ మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు. సీమా కుశ్వాహా ఉత్తరప్రదేశ్ లోని ఈటీవా జిల్లా బిడిపూర్ గ్రామంలో 1982 జనవరి 10 న జన్మించారు. 2012 లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం వల్ల బాధిత కుటుంబం తరఫున కోర్టులో వాదించి బాగా పాప్యులర్ అయ్యారు.
Nirbhaya Lawyer join BSP