Saturday, December 28, 2024

కాంచీపురంలో కామగాళ్ల కాటు.. స్నేహితుడి ఎదుటే యువతిపై

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడులో నిర్భయ తరహా ఘటన జరిగింది. గురువారం ఓ 20 ఏండ్ల యువతిని ఆమె స్నేహితుడి ఎదుటనే ఆరుగురు వ్యక్తులు కత్తితో బెదిరించి సామూహిక మానభంగం చేశారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు శనివారం తెలిపారు. గురువారం ఈ దారుణ ఘటన జరిగింది. కాలేజీ విద్యార్థిని అయిన యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లుతుండగా కాంచీపురం జిల్లాలో ఓ మారుమూల ప్రాంతంలో వీరిని దుండగులు ఆపివేసి, కత్తితో బెదిరించి దుశ్చర్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ యువతి ఆమె స్నేహితుడు క్లాస్‌మెట్లని కూడా వెల్లడైంది.

బాగా తాగి , మాస్క్‌లు ధరించి ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ జంటను చూడగానే రెచ్చిపోయి , వీరిపై దౌర్జన్యానికి దిగుతూ ఉండగానే మరో నలుగురు ముసుగులు ధరించి అక్కడికి చేరారు. తరువాత యువతిపై సామూహిక మానభంగానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. దుండగులు యువతి మెడపై కత్తిపెట్టి బెదిరించి, నిర్మానుష్య, చీకటి ప్రదేశానికి తీసుకువెళ్లి ఒకరి తరువాత మరొకరు దారుణానికి పాల్పడ్డారని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఘటనలో పాల్గొన్న ఆరుగురిలో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మరో దుండగుడి కోసం గాలిస్తున్నారని అధికారులు తెలిపారు. రేప్, లైంగిక వేధింపుల కేసును ఈ దుండగులపై మోపారు. దర్యాప్తు వేగవంతం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News