Sunday, December 22, 2024

రెండో పెళ్లి కావడం లేదని చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నిర్మల్: రెండో పెళ్లి కావడం లేదని ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిర్మల్ జిల్లా బాసర ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కిర్గుల్ గ్రామానికి చెందిన శ్రీపాల్ మొదటి భార్యకు మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకున్నాడు. శ్రీపాల్ ఓ ప్రైవేటు ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. భార్యతో విడాకులు తీసుకున్న తరువాత మళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. వివాహం చేసుకోవడానికి పిల్లను ఎవరూ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో గత కొన్ని రోజుల మద్యానికి బానిసగా మారాడు.

మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి గ్రామ శివారులోని విద్యుత్ తీగలను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. స్థానికులు అతడికి ఆపడంతో పాటు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అతడు వినకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పక్కన ఉన్న చెరువులో దూకేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. మూత్ర విసర్జన చేస్తానని కొంచెం దూరం వెళ్లి చెరువులోకి దూకాడు. యువకులు అతడికి చెరువులోకి వెళ్తుండగా తన దగ్గరికి వస్తే ముంచుతానని బెదిరించడంతో వాళ్లు వెళ్లలేదు. కాసేపటికి నీటిలో మునిగి శ్రీపాల్ మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానిక జాలర్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News