Sunday, December 22, 2024

వడ్డీ వ్యాపారుల వేధింపులు.. గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: వడ్డీ వ్యాపారులు వేధించడంతో ఓ కుటుంబంతో గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నిర్మల్ జిల్లా బాసర వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన ఉప్పలించి వేణు(54)- అనూరాధ అనే దంపతులు జీవనోపాధి కోసం 20 సంవత్సరాల క్రితం నిజామాబాద్‌కు వలస వెళ్లారు. కిరాణ షాపు నడిపిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లి చేశారు. పెద్ద కూతురు నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుంది. స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద వేణు మూడు లక్షల రూపాయలు అప్పు తీసుకొని నెల నెల వడ్డీ చెల్లించేవాడు.

డబ్బులు వెంటనే చెల్లించాలని అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేశారు. చిన్న కూతురు పౌర్ణిమ(25) ఎంబిఎ చదవింది. తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చూపులు చూశారు. అప్పు ఇచ్చినవారిని సమయం ఇవ్వాలని వేడుకున్న వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. బుధవారం తండ్రి తన భార్య, కుమార్తెను బైక్‌పై తీసుకొని బాసరలోని గోదావరి వంతెను వద్దకు చేరుకున్నారు. ముగ్గురు కలిసి ఒకేసారి గోదావరిలో దూకారు. మొదటి స్నానాల ఘాట్ వద్ద అనూరాధ కొట్టుకొని పోతుండగా గంగపుత్రులు, భక్తులు ఆమెను కాపాడారు. భక్తులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. వేణు మృతదేహం లభించగా పూర్ణిమ గల్లంతు కావడంతో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వడ్డీ వ్యాపారులు పరారీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News