Thursday, January 23, 2025

ఇందల్వాయి బస్టాండ్‌లో నిర్మల్ బస్సులు

- Advertisement -
- Advertisement -

ఇందల్‌వాయి : నిర్మల్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. టిఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఇచ్చిన మాట మేరకు ఇందల్వాయి బస్టాండ్‌లో ప్రయాణికుల ఇబ్బందులు చూసి ఇందల్వాయి బస్టాండ్ నుండి నిర్మల్ వెళ్ళుటకు తక్షణమే డిఎంతో మాట్లాడి వెంటనే నిర్మల్ డిపో అన్ని బస్సులు కూడా ఆగే విధంగా చర్యలు తీసుకొని వెంటనే ఈ సౌకర్యాన్ని ప్రయాణికులకు కల్పించారు. ఆర్టీసీ బస్సు చర్రితలోనే మొట్టమొదటిసారిగా ఇందల్వాయి బస్టాండ్‌లో నిర్మల్‌కు సంబంధించిన బస్సులు ఆగడం విశేషం. ప్రజలకు ఏ సౌకర్యం అవసరమో అలాంటి పనులు చేయడంలో టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ముందుంటారని పలువురు వ్యక్తం చేశారు.

అందుకే బాజిరెడ్డి టైగర్ అంటే టైగర్ అని మాట నిలబెట్టుకున్న ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేసే ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్ పేరు ముందు వరసలో ఉంటుందని ఆయన నిరూపించారు. బస్సు ప్రయాణికుల చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో ఇందల్వాయి బస్టాండులో ఆర్మూర్ ,నిర్మల్ ప్రయాణికులకు మంచి సౌకర్యాన్ని కల్పించి మరోసారి ఆయన పేరు నిలబెట్టుకున్నారు. అందుకే ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ నిలిచిపోయే విధంగా బాజిరెడ్డి గోవర్ధన్ నిలిచారు. ఆటోలలో ప్రయాణం చేసే ప్రయాణికులకు ఇక నుండి బస్సులలో ప్రయాణం చేసే విధంగా సురక్షితంగా గమ్యం చేరే విధంగా ప్రయాణికులకు మంచి శుభవార్త ఆయన అందించారు.

ప్రతి గంటకు ఒక బస్సు ఆగే విధంగా ఆయన చొరవ తీసుకున్నారు. ఈ సౌకర్యం ప్రయాణికులు అందించారు. అందరూ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి ఈ సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News