నిర్మల్: నాలుగు సంవత్సరాలు ప్రేమిస్తున్నానని, కూతురు తనకు ఇచ్చి పెళ్లి చేయాలని యువతి తండ్రిని ప్రమోన్మాది అడిగాడు. పెళ్లీడు వచ్చిన తరువాత పెళ్లి చేస్తామని తండ్రి సమాధానం చెప్పాడు. కోపంతో రగిలిపోయిన యువకుడు మరో యువకుడుతో కలిసి బాలిక తండ్రిని కత్తెరతో పొడిచిన సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నిర్మల్ లో 16 ఏళ్ల బాలుడు భవన కార్మికుడుగా పని చేస్తున్నాడు.
అదే కాలనీలో బాలికను(14) నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమ పేరిట వేధించాడు. పెళ్లి చేసుకోవాలని బాలికను అడగడంతో ఆమె తిరస్కరించింది. బాలిక తండ్రి వద్దకు నీ కూతురును తనకు ఇచ్చి పెళ్లి చేయాలని బాలుడు అడిగాడు. పెళ్లీడుకు వచ్చిన తరువాత పెళ్లి చేస్తానని సమాధానం చెప్పడంతో కసితో రగిలిపోయాడు. బాలిక తండ్రి చంపేస్తే సరిపోతుందని బాలుడు భావించాడు, మరో యువకుడు మహ్మద్ తౌసిఫ్ ఉల్లా(20)తో కలిసి శనివారం అర్ధరాత్రి ఆయన ఇంటికి వెళ్లి కత్తెరతో దాడి చేశాడు. వెంటనే యువకుడు అక్కడి నుంచి పారిపోయారు. ఆయనను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.