తెలంగాణ: బిజెపి తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదలైంది. దీంతో టికెట్ రాకపోవడంతో కొంత మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ముథోల్ టికెట్ రాకపోవడంతో నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రమాదేవి రాజీనామా చేశారు. కన్న తల్లి లాంటి పార్టీ తనకు అన్యాయం చేసిందని బోరున విలపించారు. అలాగే నందీశ్వర్‌గౌడ్‌కు పటాన్చెరు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న 8 మంది మండల, డివిజన్ బీజేపీ అధ్యక్షులు పటాన్చెరు అభ్యర్థిపై పునరాలోచన చేయాలని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు.
మెదట జాబితాలో తన పేరు లేకపోవడంపై బీజేపీ సీనియర్ నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ తరపున పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపారు.