Tuesday, January 21, 2025

యువ రైతు ప్రాణం తీసిన కోతుల గుంపు

- Advertisement -
- Advertisement -

నిర్మల్: పంటకు కాపలాగా వెళ్లిన యువ రైతుపై కోతుల గుంపు దాడి చేయడంతో.. తప్పించుకున్న క్రమంలో గుంటలో పడి అతడు మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. జామ్ గ్రామంలో కాడిగొల్ల సునీల్(30) అనే వ్యక్తి పొలం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండున్నర ఎకరాల పొలంలో వర, మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. మొక్క జోన్న పంటను కోతుల గుంపు ధ్వంసం చేస్తుండడంతో కాపలాగా ఆ రైతు ఉన్నాడు. ఈ 17న మొక్క జొన్న పంటకు కాపాలాగా వెళ్లాడు. అక్కడ ఉన్న కోతులు గుంపు అతడిని వెంబడించింది. తప్పించుకున్న క్రమంలో చిన్న కాలువ పైనుంచి దూకే ప్రయత్నం చేశాడు.

అతడు కాలువలో పడిపోవడంతో తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కొంచెం కోలుకోవడంతో ఈ నెల 21న మళ్లీ పొలానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు ఉండడంతో ఐసియులో ఉంచారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. అప్పటికే కుటుంబ సభ్యులు ఎనిమిది లక్షల రూపాయల వరకు ఖర్చు చేసిన కూడా తన భర్త ప్రాణాలు కాపాడుకోలేకపోయామని భార్య మనీషా కన్నీంటిపర్యంతమయ్యారు. దీంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News