Tuesday, March 4, 2025

ఎసిబి వలలో నిర్మల్ సబ్ రిజిస్ట్రార్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయంలో సోమవారం ఎసిబి సోదాలు కలకలం రేపాయి. ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న శ్రీరామరాజు ఓ బాధితుడు ఓ మ్యుటేషన్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్లినపుడు పది వేల రూపాయలు డిమాండ్ విషయం తెలిసి విస్తుబోయాడు. తన పని కావాలనే ఉద్దేశంతో ఆ పది వేలు ఇవ్వడానికి రిజిస్ట్రార్‌తో డీల్ సెట్ చేసుకున్నాడు. ఆ తర్వాత నేరుగా ఎసిబి అధికారులను సంప్రదించాడు.

వారు సోమవారం ఉదయమే రంగంలోకి దిగారు. సోమవారం ఉదయమే ఇక్కడి కవిత కాంప్లెక్స్‌కు బాధితుడితో వచ్చిన ఎసిబి అధికారులు రూ.10 వేలు మొదట సబ్ రిజిస్ట్రార్ సహాయకుడు వెంకట్‌రావు తీసుకోగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ ను అక్కడే అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. కాగా, ఎసిబి అధికారుల దాడితో గత ఎనిమిది మాసాలుగా సబ్ రిజిస్ట్రార్ నిర్మల్ కేంద్రంగా సాగిస్తున్న వసూళ్ల బాగోతం వెలుగులోకి వచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News