Tuesday, January 21, 2025

ఎన్నికల బాండ్ల కేసులో సీతారామన్‌కు హైకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

ఎన్నికల బాండ్లను కొనాలంటూ కంపెనీలపై కేంద్రమంత్రి సీతారామన్‌తోపాటు మరికొందరు వత్తిళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన కేసు విచారణలో కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీఐడీకి అప్పగించాలని బెంగళూరు పోలీస్‌లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు జస్టిస్ ఎం నాగప్రసన్న స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. జనాధికారా సంఘర్ష పరిషత్ (జేఎస్పీ) సంస్థ సహాధ్యక్షుడు ఆదర్శ ఆర్ అయ్యర్ ఇచ్చిన ఫిర్యాదులో ఐపీసి లోని 120 బి. 384 సెక్షన్ల ప్రకారం కుట్రపూరితంగా వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపించారు. కానీ ఆ సెక్షన్ల కింద ఫిర్యాదుదారుడు నమోదు చేసిన కేసు చెల్లదని కోర్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News