Monday, December 23, 2024

ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం పిఎం గతి శక్తి: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

Nirmala seetharaman speech on budget

ఢిల్లీ: పిఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్‌తో ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేశామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడారు. ఆర్థిక వృద్ధి కొనసాగేలా బడ్జెట్ రూపకల్పన చేశామని, వచ్చే 25 ఏళ్ల పురోగతిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో 60 లక్షల ఉద్యోగాలు సృష్టించామని, వేగంగా ప్రభుత్వ రంగా సంస్థల ప్రైవేటీకరణ చేపడుతామని వివరించారు. ఈ బడ్జెట్ నాలుగు ప్రధాన అంశాలు చేర్చామన్నారు. మొదటి ప్రధాని అంశం పిఎం గతి శక్తి అని, ఇందులో ఏడు రకాల అంశాలపై దృష్టి పెడుతామని, పిఎం గతి శక్తి, అభివృద్ధి, ఉత్పాదకత, అవకాశాలు, శక్తివనరులు, వాతావరణ మార్పులపై అధ్యయనం, పెట్టుబడులకు చేయూత లాంటి మొత్తం ఏడు అంశాలపై దృష్టి పెట్టామన్నారు. నేషనల్ హైవేస్ నెట్‌వర్క్‌కు 25 వేల కిలోమీటర్లు పెంచుతామని, ఇందుకు రూ.20 వేల కోట్ల సమీకరిస్తున్నామని, దేశంలో నాలుగు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఉన్నాయని, పర్వత ప్రాంతాల్ని కలిపేలా పిపిపి మోడల్లో పర్వత్‌మాలా కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు.

బడ్జెట్‌లో వ్యవసాయానికి సాంకేతిక హంగులుగా మార్చామని, డ్రోన్ల సాయంతో పంట పొలాల పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే మూడేళ్లలో 400 న్యూజనరేషన్ వందే భారత్ రైళ్లను నడిపిస్తామని, నదుల అనుసంధానానికి బడ్జెట్‌లో ప్రోత్సాహం ఇస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. పంటల మద్దతు ధర కోసం రూ.2.37 లక్షల కోట్లు ఖర్చు చేశామని, తృణధాన్యాల సంవత్సరంగా 2023 ప్రకటించామని ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. డిజిటల్ హెల్త్ సిస్టమ్ కోసం జాతీయ విధానం తీసుకొచ్చామని, ఈ స్టడీకి బడ్జెట్‌లో ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. మానసిక ఆరోగ్య వ్యవస్థ కోసం జాతీయ విధానం ఏర్పాటు చేస్తామని, నైపుణ్య అభివృద్ధికి డిజిటల్ వ్యవస్థతో రూపకల్పన చేస్తామన్నారు. ఎంఎస్‌ఎంఇల మార్కెటింగ్ కోసం కొత్త పోర్టల్ ఏర్పాటు చేశామని, ఎంఎస్‌ఎంఇల క్రెడిట్ గ్యారంటీకి రెండు లక్షల కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామన్నారు. పిఎం ఆవాస్ యోజన కింద రూ.60 వేల కోట్ల రూపాయలతో 3.8 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని నిర్మలా సీతారామన్ వివరించారు. త్వరలో ఎల్ఐసిలో పబ్లిక్ ఇష్యూ రాబోతోందన్నారు. 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, కరోనా సంక్షోభ సమయంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని, దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోందని, పేద, మధ్య తరగతి సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News