- Advertisement -
లక్ష కోట్లతో రోడ్లు, లక్ష కి.మీల రైలు
న్యూఢిల్లీ : ఈసారి బడ్జెట్‌లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మల తమిళనాడుకు పెద్ద పీట వేశారు. తమిళనాడులో రూ లక్ష కోట్లతో రోడ్ల అభివృద్థికి, లక్షా 18వేల కిలోమీటర్ల మేర రైలు మార్గాల అభివృద్ధికి కేటాయింపులు జరిగాయి. తమిళనాడు స్వరాష్ట్రం కావడంతో ఆమె ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలు వెలువడ్డాయి. ఇక బస్ ట్రాన్స్‌పోర్టు సేవల అభివృద్థికి రూ 18 వేల కోట్లు నిధులను తమిళనాడుకు సమకూర్చారు. వచ్చే రెండు మూడు నెలల్లో తమిళనాడు ఎన్నికలు జరుగుతాయి. దీనితో ఈ రాష్ట్రానికి లక్షకోట్లు కేవలం రహదారులకే కేటాయించడం కీలక అంశంగా మారింది.
- Advertisement -