Sunday, November 17, 2024

జమ్మూ కశ్మీర్‌కు రూ 1.18 లక్షలకోట్ల బడ్జెట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి రూ 1.18 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో మరింతగా అనుసంధానం చేసే దిశలో ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

2023 24 ఆర్థిక సంవత్సరానికి ఈ రూ 1.18 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఖరారు చేశారు. గృహనిర్మాణాలకు, మంచినీటి సౌకర్యానికి అత్యధిక కేటాయింపులు ఉంటాయని వివరించారు. రాజ్యసభలో బడ్జెట్‌ను ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రవేశపెట్టారు. జమ్మూ కశ్మీర్ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News