న్యూఢిల్లీ: కాలం చెల్లిన కాలుష్య కారక పాత వాహనాల స్వచ్ఛంద రద్దు విధానాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి తెలిపారు. ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న పాలసీ. దశలవారిగా పాత వాహనాలను తుక్కు కిందికి పంపించాలని తలపెట్టే విధానం అమలులోకి రానుంది. ఇటువంటి వాహనాలు ఉండే వారు తమంతతాముగా ముందకు వస్తే వీటి ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తారు. వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ల తరువాత, వాణిజ్యపరంగా వాడే వాటికి 15 ఏళ్ల తరువాత ఈ టెస్టులు చేపడుతారు. ఇటువంటి కాలం చెల్లిన వాహనాలను క్రమేపీ బయటకు పంపించడం ద్వారా వీటి స్థానంలో ఇంధన సమర్థవంతపు, పర్యావరణ హితపు సరికొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు వీలేర్పడుతుంది.
ఇంతకు ముందు కేంద్ర రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పాత వాహనాలను తక్కుగా పరిగణించే అంశంపై ప్రకటన వెలువరించారు. దీని మేరకు 15 ఏండ్లు పై బడి వాడుతున్న ప్రభుత్వ వాహనాలు, పిఎస్యుల పరిధిలోని వాహనాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించడం జరుగుతుంది. వీటిని తుక్కు వాహనాల పాలసీ పరిధిలోకి తీసుకురావడం 2022, ఎప్రిల్ 1నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. దీనికి అనుగుణంగానే ఆర్థిక మంత్రి ఇప్పుడు సంబంధిత పాలసీని ప్రకటించారు. కాలం చెల్లిన వాహనాలను తెలియచేసేందుకు ముందుకు వచ్చేవారి నుంచి వాటిని స్వాధీనం చేసుకుని తుక్కుగా మారుస్తారు. వీటిస్థానంలో ఎలక్ట్రికల్ ఇతరత్రా వాహనాలు అందుబాటులోకి రావడానికి వీలేర్పడుతుంది. హైవేల మంత్రి అంచనాల మేరకు దేశవ్యాప్తంగా దాదాపు 51 లక్షలకు పైగా పాల వాహనాలు తుక్కుగా మారేందుకు రంగంసిద్ధం అవుతుంది.
Nirmala Sitharaman announces Vehicle Scrapping policy