Monday, November 25, 2024

భారత స్టాక్ మార్కెట్ లో ఏమిటీ పన్నులు, ఛార్జీల వాయింపులు?

- Advertisement -
- Advertisement -

నోరు మెదపని సీతారామన్

భారత స్టాక్ మార్కెట్లో  వివిధ రకాల ప్రభుత్వ , స్టాక్ ఎక్స్ ఛేంజీల ఛార్జీలు

న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్లో, రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో అత్యధిక పన్నుల విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోరు మెదపలేదు. అయితే తర్వాత దానిపై వీడియో వైరల్ అయింది.

బిఎస్ఈ ఈవెంట్ లో మల్టీపుల్ ట్యాక్సెస్, ఛార్జెస్ పై ఓ బ్రోకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నేడు భారత ప్రభుత్వం బ్రోకర్ల కన్నా ఎక్కువ సంపాదిస్తోంది. నేను ఎంతో రిస్క్ తీసుకుని ఉన్నదంతా పెట్టుబడిగా పెడుతున్నాను. కానీ ప్రభుత్వం నా లాభాన్నంతా లాగేసుకుంటోంది. మీరు నా భాగస్వాములే. దీనిపై ఏమి చెప్పాలనుకుంటున్నారు?’’ అని ప్రశ్నించాడు. ఆ బ్రోకర్ ఇళ్లు కొన్నప్పుడు కూడా దానికి విధించే పన్నుల గురించి లేవనెత్తారు. దానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘‘ ఇక్కడ కూర్చుని ఓ స్లీపింగ్ పార్ట్ నర్ జవాబు చెప్పలేరు’’ అన్నారు.

భారత స్టాక్ మార్కెట్ లో విధించే వివిధ రకాల పన్నులు:

భారత స్టాక్ మార్కెట్ లో ప్రభుత్వం, స్టాక్ ఎక్స్ఛేంజీలు మల్టీపుల్ స్టాట్యూయరీ ఛార్జెస్ విధిస్తుంటాయి. ఆ ఛార్జీలు ఇలా ఉంటాయి:

  1. సెక్యూరిటీ ట్రన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్ టిటి). ఈ పన్ను మీరు ఎన్ని షేర్లు కొన్నా, అమ్మినా అటుయిటూ రెండు వైపులా విధిస్తుంటారు. మీ దగ్గర తక్కువ డబ్బు ఉండి, మీరు మార్జిన్ మనీతో ట్రేడ్ చేసినా చివరికి మీకు మిగిలేది స్వల్పమే. రిస్క్ మాత్రం ఎక్కువ.
  2. ఎక్స్ఛేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జీ
  3. జిఎస్ టి(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్)
  4. సెబీ ఛార్జెస్
  5. స్టాంప్ డ్యూటీ
  6. డిపాజిటరీ పార్టిసిపెంట్ (డిపి) ఛార్జెస్
  7. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్ టి సిజి)  ట్యాక్స్

ఈ లెక్కల అంశాన్ని లేవనెత్తినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి మౌనం వహించారు. ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రపంచంలోని ఏ స్టాక్ మార్కెట్ లోనైనా ఇలా ఉంటుందా అన్నది కూడా తెలుపలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News