Thursday, January 16, 2025

కుటుంబం కోసం రాజ్యాంగాన్ని మార్చి వేశారు : సీతారామన్

- Advertisement -
- Advertisement -

భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ ఏడాది లోకి అడుగుపెట్టిన సందర్భంగా రాజ్యసభలో సోమవారం ప్రత్యేక చర్చ జరుగుతోంది. అధికార పక్షం తరఫున కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుటుంబం కోసం రాజ్యాంగాన్నే మార్చివేశారని దుయ్యబట్టారు. “ రెండో ప్రపంచ యుద్ధం తరువాత దాదాపు 50 దేశాలకు స్వాతంత్య్రం లభించింది. అవి రాజ్యాంగాన్ని రచించుకున్నాయి.కాలక్రమంలో పలు దేశాలు తమ రాజ్యాంగం అసలు ఉద్దేశాన్ని మార్చివేశాయి. కానీ మన రాజ్యాంగం మాత్రం కాలపరీక్షలను తట్టుకొని నిలబడింది.

వాక్‌స్వాతంత్య్రాన్ని అణచివేసేందుకు కాంగ్రెస్ సవరణలు చేసింది. ఇప్పుడు మాత్రం రాజ్యాంగ పరిరక్షణ గురించి ప్రసంగాలు చేస్తోంది ” అని సీతారామన్ మండిపడ్డారు. ఇందిర హయాంలో విధించిన ఎమర్జెన్నీ , 42 వ రాజ్యాంగ సవరణ గురించి ఆమె ప్రస్తావించారు. “ కాంగ్రెస్ చేసిన సవరణలు రాజ్యాంగ బలోపేతానికి కాదు. అధికారంలో ఉన్నవారిని రక్షించుకోవడానికి, కుటుంబం కోసం ఈ ప్రక్రియను ఉపయోగించారు” అని వ్యాఖ్యలు చేశారు. ఇందిర అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని నిలిపివేయాలని ప్రయత్నించారని బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News