Monday, December 23, 2024

నిరాడంబరంగా నిర్మలా సీతారామన్ కూతురు పెళ్లి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూతురు పరకాల వాంగ్మయి వివాహం గురువారం అత్యంత నిరాడంబరంగా జరిగింది. అతి కొద్ది మంది ఆత్మీయులు, అధికారుల సమక్షంలో మంత్రి నివాసంలోనే ఈ పెళ్లి జరిగింది. వాంగ్మయి, ప్రతీక్‌లు వధూవరులు కాగా ఉడిపికి చెందిన బ్రాహ్మణులు వివాహ తంతు నిర్వర్తించారు. ఈ పెళ్లి గురించి ఆర్థిక మంత్రి కానీ ఆమె కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎవరికి ఎటువంటి ఆహ్వానాలు పంపించలేదు.

సాంప్రదాయ పద్ధతిలో సాదాసీదాగా జరిగిన పెళ్లికి రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖులు ఎవరూ రాలేదు. వధువు వాంగ్మయి గులాబీ రంగు చీర, ఆకుపచ్చ రవిక ధరించారు. పెళ్లికొడుకు ప్రతీక్ ధవళ వస్త్రాల్లో మెరిశాడు. అతికొద్ది మంది హాజరైన ఈ పెళ్లి ఫోటోలు గురువారం సాయంత్రం సామాజిక మాధ్యమాలలో కన్పించాయి. దీనితో వరుసగా శుభాకాంక్షల వెల్లువ సాగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News