న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(63) గురువారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆమె ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడింది. ఆమె వైరల్ ఫివర్, స్టమక్ ఇన్‌ఫెక్షన్ కారణంగా నిన్న ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మెరుగుపడింది. ఇదిలావుండగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న సమర్పించే కేంద్ర బడ్జెట్-2023ని ఖరారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మంతనాలు జరుపుతోంది. నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రీబడ్జెట్ సమావేశాలను పూర్తి చేశారు. వచ్చే ఏడాది బడ్జెట్ మోడీ ప్రభుత్వం చివరి బడ్జెట్ కానున్నది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం రెండో టర్మ్ ఏప్రిల్-మే 2024కల్లా ముగియనున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను సమర్పించే వార్షిక బడ్జెట్ తయారీ ప్రక్రియ అక్టోబర్ 10 నుంచే ఆరంభమైంది.
Union Finance Minister Nirmala Sitharaman has been discharged from AIIMS, Delhi: Sources
(File Pic) pic.twitter.com/AztkrMrC56
— ANI (@ANI) December 29, 2022