Wednesday, January 22, 2025

అసెంబ్లీలో జయలలిత చీర లాగి.. వెకిలి నవ్వులు నవ్వారు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిఎంకె వైఖరినితీవ్రంగా తప్పుబట్టారు. గురువారం లోక్‌సభలో అవిశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు.ఈ నేపథ్యంలో 1989లో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన అవమానాన్ని ఆమె గుర్తు చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం డిఎంకె ఎంపి కనిమొళి మాట్లాడుతూ .. మహిళలను వేధిస్తున్నారని, నగ్నంగా ఊరేగిస్తున్నారంటూ కేంద్రంపై ఆరోపణలు చేశారు.

అయితే కనిమొళి వ్యాఖ్యలను ఈ రోజు నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ 1989లో డిఎంకె వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. మణిపూర్, ఢిల్లీ, రాజస్థాన్‌లలో మహిళలు ఆవేదనకు గురవుతున్నారనే విషయాన్ని అంగీకరిస్తున్నానని, ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకోవాలని మంత్రి నిర్మల అన్నారు. దీంట్లో ఎటువంటి రాజకీయం అవసరం లేదని అంటూ 1989లో తమిళనాడులో జరిగిన ఘటనను గుర్తు చేశారు. తమిళనాడు అసెంబ్లీలో జయలలిత చీరను తాగేశారని, ఆ సమయంలో ఆమె ప్రతిపక్ష నేతగా ఉన్నారని,జయ చీరను లాగి ఆమెపై వెకిలి నవ్వులు నవ్వారని ఆమె ఆరోపించారు. ‘మీరు కౌరవ సభ గురించి మాట్లాడుతారు.

మీరు ద్రౌపది గురించి మాట్లాడుతారు .జయలలిత ఘటనను డిఎంకె మరిచిపోయిందా?’ అని మంత్రి ప్రశ్నించారు.జయ చీర లాగింది మీరు, అమెను అవమానించింది మీరే అంటూ మంత్రి నిర్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.అసెంబ్లీలో అవమానం రోజునే ఆమె శపథం తీసుకున్నారని, సిఎం అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పారన్నారు. ఈ ఘటన జరిగిన రెండేళ్లకే జయలలిత తమిళనాడు సిఎం అయ్యారని నిర్మల పేర్కొన్నారు. ఇదే అంశాన్ని నొక్కి చెబుతూ మంత్రి నిర్మల తమిళంలో మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News