Wednesday, January 22, 2025

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు అరుదైన గౌరవం దక్కింది. ఫోర్బ్స్ తన వార్షిక అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది. జాబితాలోని 2023 ఎడిషన్‌లో నలుగురు భారతీయులు చేర్చబడ్డారు. ఈ జాబితాలో అత్యున్నత స్థానంలో ఉన్న భారతీయ మహిళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల ఫోర్బ్స్ జాబితాలో చోటుదక్కింది. వరుసగా ఐదో ఏడాది నిర్మలా సీతారామన్ కు ఫోర్బ్స్ జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్త జాబితాలో నిర్మలా సీతారామన్ 32 స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ దెర్ లెయెన్ ఉండగా, రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లగార్డ్, మూడో స్థానంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమాలా హారిస్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News