రష్యాఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఆర్థికమంత్రి సూచనలు
న్యూఢిల్లీ : రష్యాఉక్రెయిన్ మధ్య వివాదం నేపథ్యంలో దేశీయ ఆర్థిక రంగాలను గమనించాలని రెగ్యులేటరీ సంస్థలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎఫ్‌ఎస్‌డిసి (ఫైనాన్షియల్ స్టబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్) సమావేశంలో ఆమె ఈ విధంగా అన్నారు. ఈ సమావేశానికి వివిధ ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు, ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ హాజరయ్యారు. ఈ కౌన్సిల్‌లో ఇతర దేశీయ ఆర్థిక అంశాలపైనా చర్చించారు. ఇంకా, స్థూల ఆర్థిక స్థిరత్వంతో వృద్ధి రేటు లక్ష్యాన్ని సాధించే విషయమై సమాలోచనలు జరిపారు.
ఎల్‌ఐసి ఐపిఒతో ముందుకు వెళ్తున్నాం
మార్కెట్లోకి ఆసక్తి ఉంది, ప్రభుత్వం కొద్ది రోజుల్లో ఎల్‌ఐసి ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)తో ముందుకు వెళ్తోందని సీతారామన్ పేర్కొన్నారు. అదే సమయంలో జాగ్రత్త వహించాలని ఆమె సూచిస్తూ, మార్కెట్ పరిస్థితి అనుకూలంగా ఉందా? అనే ఆందోళన ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఎల్‌ఐసి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు.