Wednesday, March 26, 2025

కొత్త ఇన్‌కమ్ టాక్స్ బిల్లుపై వచ్చే సెషన్‌లో చర్చ:మంత్రి సీతారామన్

- Advertisement -
- Advertisement -

కొత్త ఆదాయపు పన్ను (ఐటి) బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చకు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రకటించారు. లోక్‌సభలో ఆర్థిక బిల్లు 2025పై చర్చలకు నిర్మలా సీతారామన్ సమాధానంఇస్తూ, ఫిబ్రవరి 13న సభలో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రస్తుతం సెలెక్ట్ కమిటీ పరిశీలిస్తోందని తెలియజేశారు. సెలెక్ట్ కమిటీ తన నివేదికను పార్లమెంట్ తదుపరి సమావేశాల మొదటి రోజు సమర్పించవలసి ఉంది. ‘మేము దానిని (కొత్త ఆదాయపు పన్ను బిల్లును) వర్షాకాల సమావేశాల్లో చేపడతాం’ అని మంత్రి తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాధారణంగా జూలైలో మొదలై ఆగస్టు వరకు సాగుతుంటాయి. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ఆమోదం పొందిన తరువాత డిజిటల్ రికార్డును కూడా మదింపునకు పరిగణనలోకి తీసుకోనున్నట్లు సీతారామన్ చెప్పారు. 1961 ఆదాయపు పన్ను చట్టం ఆదాయ వ్యయాన్ని సూచించే అకౌంట్ పుస్తకాలను,

భౌతికంగా ఉంచిన లేదా ప్రతి మాన్యువల్ రికార్డును పరిశీలించేందుకు అనుమతిస్తున్నది. అయితే, 1961 చట్టంలో డిజిటల్ ప్రస్తావన లేనందున అది తరచు వివాదాస్పదం అవుతోందని, జనం కోర్టును ఆశ్రయించి, పాస్‌కోడ్‌ను పంచుకోకుండా రక్షణ కోరుతున్నారని ఆమె తెలిపాను. ‘అందువల్ల డిజిటల్ ఒక వివాదంగా మారుతోంది. ఇప్పుడు ఉన్న ఆ లోటును కొత్త ఆదాయపు పన్ను బిల్లులో భర్తీ చేస్తున్నాం. బిల్లు సెలెక్ట్ కమిటీ ముందు ఉంది’ అని ఆమె చెప్పారు. తనిఖీ, స్వాధీనం కేసుల్లో ఆన్‌లైన్ ట్రేడింగ్, పెట్టుబడి ఖతాలు సహా వర్చువల్ డిజిటల్ స్పేస్, కంప్యూటర్ సిస్టమ్‌ల అందుబాటు కోడ్‌ను అధిగమించే అధికారాలను పన్ను అధికారులకు కొత్త బిల్లు దత్తం చేస్తుంది. 1961 ఆదాయపు పన్ను చట్టం పరిమాణంలో సగం ఉన్న సరళీకృత ఆదాయపు పన్ను బిల్లు దావా అవకాశాన్ని, కొత్త అన్వయాన్ని కనిష్ఠ స్థాయికి చేర్చడం ద్వారా పన్నును కచ్చితత్వం చేస్తుందని ఆదాయపు పన్ను శాఖ ఇంతకు ముందు తెలియజేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News