Wednesday, January 22, 2025

రూపాయికి కిలో బియ్యం పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత?: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా బాన్సువాడలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తునప్పుడు ఆమె కాన్వాయ్ ని కాంగ్రెస్  కార్యకర్తలు అడ్డుకున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సివిల్ సప్లై అధికారికి క్లాస్ పీకారు. ఓ రేషన్ షాపు సందర్శించిన మంత్రి అక్కడ ప్రధానమంత్రి మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని అడిగారు. రూపాయికి కిలో బియ్యం పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంతని అక్కడున్న సివిల్ సప్లై అధికారిని ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక సదరు అధికారి నీళ్లు నమిలారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్ధగంటలో తెలుసుకొని సమాధానం చెప్పాలని నిర్మలా సీతారామన్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News