Monday, December 23, 2024

కొత్త పన్ను విధానంతో మధ్యతరగతికి మేలు :నిర్మల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తమ కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త పన్నుల విధానం వల్ల మధ్య తరగతి ప్రజలు మేలు జరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. దీనిని గుర్తించి ప్రజలు ఈ పన్నుల విధానం వర్తింపచేసుకుంటారని భావిస్తున్నట్లు ఆర్‌బిఐ పాలకమండలి సమావేశంలో చెప్పారు. మధ్య తరగతి ప్రజలకు ఏదో విధంగా చేతుల్లో కొంత డబ్బు మిగలాలి. దీనిని దృష్టిలో పెట్టుకునే కొత్త పన్నుల విధానం రూపొందించినట్లు వివరించారు.

వ్యక్తులు కేవలం ప్రభుత్వ పథకాలలోనే పెట్టుబడులు పెట్టాలని తాము తెలియచేయడం లేదని, ఈ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో కొత్త పన్నుల విధానంలో మార్పులు తీసుకువచ్చారు. క్రిప్టో విషయంలో ఉమ్మడి సంవిధాన రూపకల్పన దిశలో జి 20 దేశాలతో చర్చిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News