Friday, January 3, 2025

ఈ నెల18 నుంచి ఎన్‌పీఎస్ వాత్సల్య

- Advertisement -
- Advertisement -

తమ పిల్లల భవిష్యత్ కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం బడ్జెట్‌లో ప్రకటించిన ఎన్‌పిఎస్ వాత్సల్యను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 18 న ప్రారంభించనున్నారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) , కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి , ఆర్థిక శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 18 ఏళ్ల లోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు/సంరక్షకులు ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతా తీసుకోవచ్చు. పిల్లలు మేజర్లు అయ్యాక ఈ ఖాతా సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాగా మారుతుందని జులైలో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

దేశం లోని ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పించాలనే లక్షంతో 2004 లో తీసుకొచ్చిన ఎన్‌పీఎస్, పన్ను ప్రయోజనాలతోపాటు దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగా బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని ఇప్పుడు మరింత విస్తృత పరుస్తూ మైనర్లకూ అందుబాటు లోకి తేవడం గమనార్హం. సుకన్య సమృద్ధి యోజన ,పిపిఎఫ్ వంటి మదుపు పథకాలకు ఇది అదనం. ముందుగానే పెట్టుబడులు ప్రారంభించడానికి వీలయ్యే ఈ పథకం వల్ల చక్రవడ్డీ ప్రయోజనం పొందవచ్చు. మైనర్లుగా ఉన్నప్పుడే ఈ ఖాతా తెరవడంతో రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో కార్పస్ సమకూరుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News