Sunday, December 1, 2024

రేపు లోక్‌సభలో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు

- Advertisement -
- Advertisement -

ప్రవేశపెట్టనున్నకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటు దిగువ సభలో బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, 2024ను ప్రవేశపెట్టనున్నారు.

సచివాలయం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం… సీతారామన్  బిల్లును ప్రవేశపెడతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1955, బ్యాంకింగ్ కంపెనీలు (సముపార్జన, అండర్‌టేకింగ్‌ల బదిలీ) చట్టం, 1970… బ్యాంకింగ్ కంపెనీలు (అండర్‌టేకింగ్‌ల స్వాధీనం ,బదిలీ) చట్టం, 1980ను  పరిగణనలోకి తీసుకుని, రేపు లోక్‌సభలో ఆమోదిస్తారు.

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా రైల్వే చట్టం, 1989ని సవరించడానికి బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు, దీనిని పరిశీలన, ఆమోదం కోసం షెడ్యూల్ చేయనున్నారు.

కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ సోమవారం లోక్‌సభలో కోస్టల్ షిప్పింగ్ బిల్లు, 2024ను ప్రవేశపెట్టనున్నారు. ఇంకా కేంద్రమంత్రులు ఎస్. జైశంకర్, జయంత్ చౌదరి, పంకజ్ చౌదరి కీలక అంశాలపై ప్రకటనలు చేయనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News