Friday, January 3, 2025

నేడే కేంద్ర బడ్జెట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం దేశ ఆర్థిక దిశాదశానిర్ధేశాన్ని శాసించే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 202425 కేంద్ర బడ్జెట్ మోడీ 3.0 ప్రభుత్వపు తొలి కీలక గణనీయ ఆర్థిక పత్రం అవుతుంది. ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు, వేతనజీవులు ఆదాయపు పన్ను సంబంధిత ప్రకటనలపై ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పన్నుల హేతుబద్ధీకరణ, రేట్లలో సరళీకృతం, టాక్స్ స్లాబ్‌ల విస్తృతి వంటివాటిపై ప్రధానంగా అందరి దృష్టి నెలకొని ఉంది. ప్రత్యేకించి పన్నులలో కోతలు ఉంటాయా? లేక మోతలతో సాగదీస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఇప్పుడు అమలులో ఉన్న నూతన పన్నుల వ్యవస్థీకృత విధానంలోఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ 3 లక్షల వరకూ ఉంది. కాగా దీనిని రూ 3.50లక్షలకు పెంచాలని డిమాండ్ ఉంది.

ఇప్పటి పద్థతిలో వార్షికంగా రూ 15లక్షలు అంతకు మించి ఆదాయం ఉన్న వారిపై 30శాతం పన్ను పడుతోంది. దీనిని సర్దుబాటు చేయాలని డిమాండ్ వస్తోంది. రూ 30లక్షల వరకూ ఆదాయం ఉన్న వారికి ఈ పన్ను ను వర్తింప చేయాలని కోరుతున్నారు. ఇక తక్కువ స్థాయి ఆదాయ వర్గాలకు ఐటి రేటును వార్షికంగా 15 శాతం గా ఖరారు చేయాలని కోరుతున్నారు. బడ్జెట్‌లో ఈసారి మూల ధన పెట్టుబడులను పెంచాలని, ప్రత్యేకించి కీలక రంగాలు అయిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నిర్మాణ, ఉత్పత్తి, హరిత ఇంధన రంగాలపై ప్రధానంగా దృష్టి సారించి తగు విధంగా కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయపెట్టుబడుల్లో ఏటా 30 శాతం వృద్థిని చూపుతోంది.

ఈసారి ఈ విషయంలో భారీ స్థాయిలో మార్పు ఉంటుందని ఎక్స్‌ఎల్‌ఆర్‌ఎల్‌లో ఫైన్సాన్స్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ త్రిలోచన్ త్రిపాఠీ చెప్పారు. మూలధన వ్యయ పెట్టుబడులు పెరగడం వల్లనే భారతదేశం మరింత వేగవంతంగా వృద్ధి చెందేందుకు వీలుంటుంది. ఈ క్రమంలో ఈసారి మూలధన వ్యయ పెట్టుబడిలో కేటాయింపులు ఈ 202425 ఆర్థిక సంవత్సరంలో పెరుగుదల 50 శా తం వరకూ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇంతకు ముం దటి లాగానే పలు కీలక రంగాల్లో ప్రైవేటు రంగ ప్రాతినిధ్యం కోసం కూడా చర్యలు ఉంటాయి. రక్షణ రంగం లో ఎక్కువ వృద్ధికి చర్యలు తీసుకుంటారు. పోర్టులు, రైల్వే, విమానయానం వంటి వాటిలో మరింత పెట్టుబడులకు రంగం సిద్ధం చేస్తారు. ఎంఎస్‌ఎంఇలు, స్టార్టప్‌లకు ఎక్కువగా ప్రోత్సాహం అందించేందుకు బడ్జెట్‌లో ప్రత్యేక స్కీంలు ప్రకటించేందుకు అవకాశం ఉంది.

ఉన్నత విద్యకు అత్యధిక ఊతం
ఈసారి బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రత్యేకించి ఉన్నత విద్యకు మద్దతు పద్దులు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు వెలువడ్డ తాత్కాలిక బడ్జెట్‌లో కూడా దీని గురించి ఎక్కువగా ప్రస్తావించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జాతీయ విద్యావిధానం (నెప్) 2020లో తీసుకువచ్చింది. ఇందులోని పలు ప్రతిపాదనలు ఇప్పటికీ వాస్తవిక రూపం దా ల్చలేదు. నెప్ 2020కు తోడ్పాటు అందించే దిశలోనే ఇప్పటి పూర్తి స్థాయి బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని ,ఈ విధంగానే ఉండాలని విద్యారంగ ప్రముఖులు ఆశిస్తున్నారు.

సరైన బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఉన్నత విద్య అవకాశాలు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం ఉండదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి అత్యధిక జనసంఖ్యలో ఉన్న యువతను పరిగణనలోకి తీసుకుని ఈసారి బడ్జెట్‌లో విద్యారంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని వెల్లడైంది. ప్రత్యేకించి విద్యార్థుల తొలి దశలో వారిలో విశ్లేషణాత్మక ఆలోచనలు, వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వీలుగా బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉండాలని కోరుతున్నారు. ఈసారి బడ్జెట్‌లో ముఖ్యంగా బోధనా పద్ధతులను మరింతగా తీర్చిదిద్దేందుకు అవసరం అయిన చర్యలు కావాలని విద్యాధికులు భావిస్తున్నారు.

ఇంధన రంగంలో పన్నుల రాయితీలు?
దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, ఈ రంగంలో సమస్యల పరిష్కారానికి అవసరం అయిన దిశలో ఈ సారి బడ్జెట్‌లో నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని ప్రభు త్వం భావిస్తోంది. ప్రత్యేకించి శుద్ధ హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్, కార్బన్ గ్రాహకం వంటి చర్యలతో దేశంలో ఇం ధన రంగంలో 2030 వరకూ వార్షికంగా 35 బిలియన్ డాలర్ల నిర్ణీత పెట్టుబడులకు రంగం సిద్ధం కానుంది. ఇక మధ్యప్రదేశ్‌లో గెయిల్ తలపెట్టిన 1500 కెటిపిఎల సా మర్థపు ఇథేన్ క్రాకర్ యూనిట్‌కు ఆమోదం, సబ్సిడీలు, ఇంధన రంగంలో పన్నుల కోతలు వంటివాటి చర్యలతో ఇంధన రంగ బలోపేతం కీలకంగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు.

బీమారంగానికి ప్రాధాన్యత
ఈసారి కేంద్ర బడ్జెట్‌లో దేశంలోని ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ పట్ల ఎటువంటి కోణంలో ప్రతిపాదనలు ఉంటాయనేది కీలకం అయింది. చాలా కాలంగా తమ రంగంపై జిఎస్‌టి తగ్గింపును ఈ సంబంధిత కంపెనీలు ఆశిస్తున్నాయి. ప్రస్తుతం ఇన్యూరెన్స్ ప్రీమియంలపై జిఎస్‌టి 18 శా తంగా ఉంటోంది. ఇది అత్యధికం అని విమర్శలు వెలువడ్డాయి. దీని వల్లనే ఎక్కువ మంది పాలసీల పట్ల మొగ్గుచూపడంలేదని, ఈ రేటును తగ్గించాల్సి ఉందని డిమాం డ్ తలెత్తింది. ఇక పాలసీహోల్డర్లకు తమ మెడికల్ ఇన్సూరెన్స్‌లపై ఎక్కువగా పన్నుల రాయితీలు ఉండాలని వాదన తలెత్తింది.

ఈసారి బడ్జెట్‌పై తెలంగాణ ఆశలు?
తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పారిశ్రామిక వాడల ఏర్పా టు విషయంలో చాలా సంవత్సరాలుగా ఉన్న డిమాండ్‌పై కేంద్రం ఈ బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేస్తుందా? ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటిఆర్ కారిడార్ వంటి కీలక ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే చర్యలపై బడ్జెట్‌లో ప్రాతిపదికలు ఉంటాయా? అనేది కీలకం అవుతోంది. మణుగూరు, కోట భారజల కర్మాగారాల ఏర్పాటుకు కేటాయింపులు, ఐఐటి ఏర్పాట్లు వంటివాటికోసం తెలంగాణ డిమాండ్లుగా ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు ఇది ఏడవబడ్జెట్ అవుతుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి తమ బడ్జెట్ ప్రసంగం చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News