- Advertisement -
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం న్యూఢిల్లీలో నేషనల్ మోనెటైజేషన్ పైప్‌లైన్(ఎన్‌ఎంపి) ప్రారంభించనున్నారు. ఇది వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వం విక్రయించపోయే మౌలిక ఆస్తుల జాబితాను సిద్ధం చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం జాతీయ రహదారులు, పవర్ గ్రిడ్ పైప్‌లైన్‌లతో సహా రూ. 6 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ఆస్తులను ఖరారు చేస్తోందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డిఐపిఎఎమ్) కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే ఈ నెల ప్రారంభంలో తెలిపారు. రూ. 6,000 కోట్ల జాతీయ మానిటైజేషన్ ప్లాన్ జరుగుతోందని, దీంతో పాటు పవర్ గ్రిడ్ పైప్‌లైన్, జాతీయ రహదారి నుండి టిఒటి (టోల్ -ఆపరేట్ -ట్రాన్స్‌ఫర్) వంటి బహుళ ఆస్తుల అంశాలు వీటిలో ఉంటాయి.
- Advertisement -