Sunday, December 22, 2024

వాస్తవాన్ని బయటపెట్టిన నిర్మలమ్మ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హుస్నాబాద్: మోటార్లకు మీటర్లు పెట్టనందుకే డబ్బులు ఇవ్వలేదన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై హుస్నాబాద్ సభలో మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ గొంతులో పాణం ఉన్నంత కాలం, బోరు బాయి కాడ మీటర్ పెట్టా.. అని అన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు.

నిర్మలా సీతారామన్ ఉన్న విషయాన్ని బయటపెట్టారని, దీంతో బిజెపికి ఒక్క సీటు కూడా రాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ వాళ్ళు మీటర్లు పెట్టలేదు కాబట్టి డబ్బులు ఇవ్వలేదు అని నిర్మలా సీతారామన్ క్లియర్‌గా చెప్పారని స్పష్టం చేశారు. మోటార్లకు మీటర్లు అని బిజెపి, మూడు గంటలు కరెంటు అని కాంగ్రెస్ అంటున్నాయని… ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని మంత్రి హరీశ్ రావు ప్రజలను కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News