Saturday, March 29, 2025

జిమ్నాస్టిక్స్‌లో నిష్కా అగర్వాల్‌కు స్వర్ణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉజ్బెకిస్థాన్ వేదికగా జరిగిన అంతర్జాతీయ అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన తెలంగాణ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. తాష్కంట్ నగరంలో జరిగిన అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ పోటీల్లో నిష్కా అసాధారణ ప్రతిభతో స్వర్ణంతో పాటు కాంస్య పతకాన్ని కూడా సొంతం చేసుకుంది. బాలికల జూనియర్ టెబుల్ వాల్ట్ విభాగంలో నిష్కా పసిడి పతకాన్ని గెలుచుకుంది. అంతేగాక ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News