Sunday, January 19, 2025

బాలల దినోత్సవంలో పాల్గొన్న నీతా ముఖేశ్ అంబానీ

- Advertisement -
- Advertisement -

బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్‌పర్సన్ శ్రీమతి  నీతా ఎం అంబానీ పాల్గొన్నారు.  యువ జీవితాలను పోషించడం , వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో  తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్‌లో, ప్రతి జీవితం విలువైనదని , ప్రతి బిడ్డ సంతోషంగా, ఆరోగ్యంగా పెద్దగా కలలు కనడానికి , వారి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోడానికి అర్హులని మేము విశ్వసిస్తున్నామన్నారు.

ఈ సంవత్సరం, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి తమ  కొత్త ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రవేశపెట్టామని చెప్పడానికి  మాకు గర్వంగా ఉందన్నారు.

50,000 పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల స్క్రీనింగ్‌లు మరియు చికిత్స ఉచితం

కౌమార బాలికలకు 10,000 ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకా ఉచితం.

మా గుండె లోతుల్లో మిషన్ పట్ల అంకిత భావం ఉంది. వారి బాగు, సంతోషం,  అభివృద్ది చూడాలనుకుంటున్నాం. వారికి మంచి భవిష్యత్తు, ఆరోగ్యం, ఆశావాహ భవిష్యత్తు చూడాలనుకుంటున్నామన్నారు నీతా.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News