Thursday, December 26, 2024

బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముంబయి ఇండియన్స్ జట్టు యజమాని, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ బుధవారం రాత్ర బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శంచుకున్నారు. ముంబయి జట్టు ప్లేఆప్‌కు అర్హత సాధించాలని అమ్మవారికి ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. ఎల్లమ్మ గుడిలో ఆమె 15 నిమిషాలు పాటు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో నీతా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి అభిమానులను అలరించారు. హైదరాబాద్‌లో మ్యాచ్ ఉంటే చాలు బల్కంపేట ఎల్లమ్మను నీతా అంబానీ సందర్శించుకుంటారు.
ఐపిఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్‌పై హైదరాబాద్ సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌మెచ్ 277 పరుగులు చేసి రికార్డు సృష్టించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News