Tuesday, September 17, 2024

పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

- Advertisement -
- Advertisement -

పారాలింపిక్స్‌లో భారత్ భారత్ స్వర్ణ పతకం సాధించింది. పురుఫుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్3లో నితేశ్ కుమార్ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం. మరోవైపు మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. భారత షట్లర్ తులసిమతి మురుగేశన్ రజతం, మనీషా రామ్‌దాస్ కాంస్య పతకం గెలుచుకున్నారు. అంతేగాక పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 విభాగంలో యోగేశ్ కతునియా రజత పతకం సాధించాడు. పారిస్ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 11 పతకాలు సాధించింది. కాగా, తొలిసారి పారాలింపిక్స్ బరిలో దిగిన నితేశ్ కుమార్ అసాధారణ ప్రతిభతో ఏకంగా స్వర్ణం సాధించి సత్తా చాటడు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో నితేశ్ 2114, 1821, 22321 తేడాతో డానియల్ బెతెల్ (బ్రిటన్)ను ఓడించాడు.

ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. తొలి గేమ్ ప్రారంభంలో నితేశ్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే కీలక సమయంలో నితేశ్ పుంజుకున్నాడు. అద్భుత ఆటతో బెతెల్‌ను హడలెత్తిస్తూ ముందుకు సాగాడు. ఇదే క్రమంలో సెట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. కానీ రెండో గేమ్‌లో నితేశ్‌కు ప్రత్యర్థి బెతెల్ నుంచి గట్టి ప్రతిఘటన తప్పలేదు. బెతెల్ అసాధారణ పోరాట పటిమను కనబరుస్తూ నితేశ్ ఆధిపత్యాన్ని సమర్థంగా అడ్డుకున్నాడు. ఇదే క్రమంలో సెట్‌ను కూడా దక్కించుకున్నాడు. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా పోటీ నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇటు నితేశ్ అటు బెతెల్ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో సెట్ టైబ్రేకర్‌కు వెళ్లక తప్పలేదు. అయితే ఇందులో చివరి వరకు నిలకడగా ఆడిన నితేశ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి తన ఖాతాలో పసిడి పతకాన్ని జత చేసుకున్నాడు. మరోవైపు డానియల్ వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ రజతంతోనే సంతృప్తి పడాల్సి వచ్చింది. టోక్యోలో కూడా బెతెల్ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. ఈసారి కూడా అతనికి నితేశ్ చేతిలో ఓటమి తప్పలేదు.

తులసిమతికి రజతం..
మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత షట్లర్ తులసిమతి మురుగేశన్ రజత పతకం సాధించింది. ఎస్‌యు5 సింగిల్స్ ఫైనల్లో తులసిమతి పరాజయం చవిచూసింది. చైనా షట్లర్ యంగ్‌తో జరిగిన పోరులో తులసిమతి 1721, 1021 తేడాతో ఓటమి పాలైది. తొలి సెట్ ఆరంబంలో కాస్త గట్టిగా పోరాడిన తులసిమతి ఆ తర్వాత అదే జోరును కొనసాగించడంలో విఫలమైంది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన యంగ్ సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో తులసిమతి ప్రత్యర్థికి కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. దూకుడుగా ఆడిన యంగ్ అలవోకగా విజయంతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. తులసిమతి రజతంతో సంతృప్తి పడక తప్పలేదు. ఇక ఇదే విభాగంలో భారత్‌కే చెందిన మనీషా కాంస్య పతకం గెలుచుకుంది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో మనీషా 2112. 218 తేడాతో కేథరిన్ రొసెన్‌గ్రెన్ (డెన్మార్క్)ను ఓడించింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన మనీషా ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. అలవోకగా రెండు సెట్లు గెలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

సిల్వర్‌తో మెరిసిన యోగేశ్
పారాలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు చెందిన యోగేశ్ కతునియా అసాధారణ ప్రతిభతో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల డిస్కస్ త్రో విభాగంలో యోగేశ్ రెండో స్థానంలో నిలిచి తన ఖాతాలో రజత పతకాన్ని జత చేసుకున్నాడు. అద్భుత ప్రదర్శనతో అలరించిన యోగేశ్ 42.22 మీటర్ల దూరాన్ని విసిరి పెను ప్రకంపనలు సృష్టించాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన యోగేశ్ ఊహించినట్టే మెరుగైన ప్రతిభతో రజతం దక్కించుకున్నాడు. ఇంతకుముందు టోక్యో ఒలింపిక్స్‌లోనూ యోగేశ్ రజతం సాధించాడు. పారిస్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాడు. బ్రెజిల్‌కు చెందిన క్లాడిని బాటిస్టాకు స్వర్ణం లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News