హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి భారీగా నిర్మించారు. ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నితిన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…
కథ యూనిక్‌గా…
పూర్తి స్థాయి కమర్షియల్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. ఇందులో పవర్‌ఫుల్ రోల్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ వున్నాయి. సినిమాలోని కథ చాలా యూనిక్‌గా వుంటుంది. పొలిటికల్ నేపథ్యంలో ఇది వరకు చాలా చిత్రాలు వచ్చాయి. కానీ ఇందులో వుండే పాయింట్ చాలా కొత్తగా వుంటుంది.
ఫ్యాన్స్‌కి పండగలా…
సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది. నేను ఐఎఎస్ పాత్ర ఇప్పటి వరకు చేయలేదు. మాస్ సినిమా అయినప్పటికీ కథలో, క్యారెక్టర్‌లో చాలా ఫ్రెష్‌నెస్ వుంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇందులో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, మంచి పాటలు, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ వున్నాయి. ఫ్యాన్స్‌కి పండగలా వుంటుంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.
ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పేశా…
2017లో ‘లై ’షూటింగ్ సమయంలో రాజశేఖర్ ఎడిటింగ్ స్టయిల్ నాకు బాగా నచ్చింది. అలాగే సినిమా గురించి మాట్లాడుతున్నపుడు తన ఇన్‌పుట్స్ కూడా బావుండేవి. ‘నువ్వు డైరెక్టరైతే బావుంటుంది’ అని అప్పుడే చెప్పాను. నేను చెప్పిన తర్వాత తనలో ఆలోచన మొదలైంది. కోవిడ్ సమయంలో ఇంట్లో ఉంటూ కథ రాసుకున్నాడు. నాకు ఈ సినిమా కథ చెప్పినపుడు ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పేశాను.
చాలా హోంవర్క్ చేశారు…
సినిమాలో నా ఐఎఎస్ పాత్ర కోసం దర్శకుడు శేఖర్ చాలా హోంవర్క్ చేశారు. చాలా మంది ఐఎఎస్ అధికారులని కలవడం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ స్టడీ చేసి షూటింగ్ సమయంలో ఎక్కడ హుందాగా వుండాలి, ఎక్కడ మాస్‌గా ఉండాలనేది తనే చెప్పాడు. ఇక ‘మాచర్ల నియోజకవర్గం’ పూర్తి ఫిక్షనల్ స్టొరీ. సముద్రఖనికి శేఖర్ కథ చెప్పినపుడు.. తమిళనాడులో ఇలాంటి సంఘటన జరిగిందని అన్నారు.
అవుట్ అండ్ అవుట్ కామెడీ…
సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్ కామెడీ వుంటుంది. నేను, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ ట్రాక్ అవుట్ అండ్ అవుట్ కామెడీగా వుంటుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా ఫన్ వుంటుంది. ఊర మాస్‌లా కాకుండా మాస్ కూడా క్లాస్ టచ్‌తో వుంటుంది. ఇక ప్రస్తుతం వక్కంతం వంశీతో ఒక సినిమా చేస్తున్నా.
Nithin Interview about ‘Mancherla Niyojakavargam’