Monday, December 23, 2024

జెపి నడ్డాతో టాలీవుడ్ హీరో నితిన్ భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హీరో నితిన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శనివారం హనుమకొండ సభకు హాజరైన నడ్డా నితిన్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం ఉదయం విమానాశ్రయం చేరుకున్న జెపి నడ్డా మాజీ మహిళ క్రికెటర్ మిథాలీ రాజ్‌తోనూ భేటీ అయ్యారు. ఇటీవల మునుగోడు సభకు హాజరైన కేంద్రం హోమంత్రి సైతం ఎన్టీఆర్‌ను కలవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో బిజెపి నాయకులు టాలీవుడ్ హీరోలతో భేటీ అవుతుండటం రాజకీయ వర్గాల్లో పలు చర్చలకు తావిస్తోంది. ఈ భేటీలో ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎంఎల్‌సి రాంచందర్‌రావు కూడా పాల్గొన్నారు.

Nithin Meets with JP Nadda in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News