హీరో నితిన్ మాస్, కమర్షియల్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ’మాచర్ల నియోజకవర్గం’ భారీ మాస్ కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలుగా, ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ “నా నమ్మకం ‘మాచర్ల నియోజకవర్గం’తో మరోసారి నిజమైంది. చాలా కాలం తర్వాత నా జోనర్‌ని మార్చి యాక్షన్‌లోకి వెళ్లాను.
ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది”అని అన్నారు. నిఖితా రెడ్డి మాట్లాడుతూ “మా సినిమాకు ఫస్ట్ డే షేర్స్ అద్భుతంగా వున్నాయి. ఏపీ, తెలంగాణలో 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నితిన్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్”అని చెప్పారు. చిత్ర దర్శకుడు ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ “మాచర్ల నియోజకవర్గం చిత్రంతో నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమాని థియేటర్‌లో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, కృతి శెట్టి, ప్రసాద్ మురెళ్ళ, సాహి సురేష్ పాల్గొన్నారు.
Nithin Speech at ‘Macherla Niyojakavargam’ success meet