Sunday, December 22, 2024

‘అడవి’ రీ రిలీజ్

- Advertisement -
- Advertisement -

పదేళ్లకు ఒకసారి యూత్ జనరేషన్ మారుతుంటుంది. అందుకే రీ రిలీజ్ సినిమాలకు విశేషమైన స్పందన లభిస్తోందని ప్రముఖ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ అన్నారు. గతంలో నితిన్, ప్రియాంక కొఠారి హీరోహీరోయిన్లుగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి’ సినిమాను విశాఖ టాకీస్ పతాకంపై నిర్మాత నట్టి కుమార్ విడుదల చేశారు. మళ్ళీ రీ రిలీజ్ సినిమాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాను ఈ నెల 14న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ “జనరేషన్ మారుతున్న ప్రతిసారి గతంలో వచ్చిన కొన్ని చక్కటి సినిమాలను చూడాలని మారుతున్న యూత్ కోరుకుంటుంటారు. ‘అడవి’ సినిమానే తీసుకుంటే ఫారెస్ట్ ఫోటోగ్రఫీ, సాంగ్స్, సౌండ్ వంటివన్నీ సినిమాకు హైలైట్‌గా ఉంటాయి”అని అన్నారు. ‘అడవి’ చిత్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ మాట్లాడుతూ “12 ఏళ్ల క్రితం నేను విడుదల చేసిన ఈ సినిమాకు అద్బుతమైన కలెక్షన్స్ వచ్చాయి. టెక్నికల్‌గా ఎప్పటికప్పుడు వండర్స్ క్రియేట్ చేసే రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమాను కూడా చక్కటి విజువల్ ట్రీట్‌గా తెరకెక్కించారు. దాదాపు వంద థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు.

Nithin’s ‘Adavi’ to re release on Oct 14

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News