నెవార్క్: న్యూ జెర్సియన్ నగరం నెవార్క్ జనవరిలో మోసపోయామని అంగీకరించింది. హిందూ దేశమైన కైలాసతో ‘సిస్టర్ సిటీ ప్యాక్ట్’ ఒప్పందంలో చేరమని నెవార్క్ మేయర్ రాస్ బరాకాకు ఆహ్వానం పంపడంతో మోసపోయామని అంగీకరించింది. నివేదికల ప్రకారం కైలాస ప్రతినిధులు ఆహ్వానాన్ని అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత వారు నెవార్క్‌లో జరిగిన ఒప్పందంపై సంతక కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. సంతకాల కార్యక్రమప్పుడు ‘ మా సంబంధం సాంస్కృతిక, రాజకీయ అభివృద్ధికి, రెండు ప్రదేశాలలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలు మెరుగుపడ్డానికి’ అని బరాకా, కైలాస ప్రతినిధితో అన్నారు.
నిత్యానంద తనని మోసగించాడని గత వారం బారాక తెలిపారు. ఒప్పందంలో ఎలాంటి ముడుపులు చేతులు మారలేదని ఆ నగర ప్రతినిధి అన్నారు. ఈ ఒప్పందం జరగడం దురదృష్టకరమని భావించినప్పటికీ వివిధ సంస్కృతులతో పనిచేయడానికి నెవార్క్ కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. వాస్తవానికి నిత్యానంద 2019 నుంచి భారతీయ చట్టాన్ని తప్పించుకు తిరుగుతున్న మోసకారి. ఆయనపై అనేక బలాత్కార, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. అయితే వాటిని నిత్యానంద తోసిపుచ్చుతున్నాడు. నిత్యానంద ప్రస్తుతం కైలాస అనే దేశాన్ని సృష్టించుకుని అందులో ఉంటున్నాడు. బిబిసి నివేదిక ప్రకారం, కైలాస ప్రతినిధులు స్థిరమైన అభివృద్ధి, నిర్ణయాత్మక ప్రక్రియలలో మహిళల ప్రాతినిధ్యంపై చర్చల్లో పాల్గొన్నారు.