Monday, December 23, 2024

ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ ఎనిమిదో పాలక మండలి సమావేశానికి శనివారం ప్రధాని నరేంద్ర మోఢీ అధ్యక్షత వహించనున్నారు. ఢిల్లీలో ప్రగతి మైదాన్ సమ్మిట్ మీటింగ్ రూమ్ లో సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు,లెఫ్టినెంట్ గవర్నర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సభ్యులు పాల్గొనున్నారు.

ఈ సమావేశాన్ని ‘వికసిత్ భారత్-2047’ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. వివరాల ప్రకారం, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధాని చర్చించనున్నారు. నీతి ఆయోగ్ భేటీలో తెలంగాణ పాల్గొనట్లేదని సమాచారం. సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News