Friday, November 22, 2024

మిషన్ భగీరథకు నీతిఆయోగ్ ప్రశంస

- Advertisement -
- Advertisement -

 

Niti Aayog praised for Mission Bhagiratha Scheme

వందశాతం ఇళ్లకు మంచినీరు అందిస్తూ దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న తెలంగాణ
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న కేంద్ర నీతి ఆయోగ్ మరోసారి ప్రసంశల జల్లు కురిపించింది. మిషన్ భగీరథ ఒక అద్భుత పథకమని కితాబిచ్చింది. దేశానికి రోల్ మోడల్‌గా నిలించిందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్ర నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ ద్వారా వంద శాతం ఇళ్ళకు తాగు నీరు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 54 లక్షల ఆరు వేల 70 ఇళ్ళకు మిషన్ భగీరథ ద్వారా నల్లాలతో తాగునీటిని అందిస్తోందన్నారు. ఈ పథకం రాష్ట్రంలో వందకు వంద శాతం విజయవంతం అయిందని పేర్కొన్నారు. అలాగే హర్యానాలో30 లక్షల 96 వేల 792, గోవా రాష్ట్రంలో రెండు లక్షల 63 వేల 13 ఇళ్ళకు, పుదుచ్చేరి లో ఒక లక్ష 14 వేల 908 ఇళ్ళకు తాగు నీటిని అందిస్తూ వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయని కేంద్ర నీతి ఆయోగ్ పేర్కొంది.

ఇది సిఎం కెసిఆర్ అకుంఠిత దీక్షకు నిదర్శనం.. బోయినపల్లి వినోద్‌కుమార్

కేంద్ర నీతి ఆయోగ్ మిషన్ భగీరథ పథకానికి కితాబును ఇవ్వడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ప్రతి ఇంటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్న సిఎం కెసిఆర్ అకుంఠిత దీక్షకు నిదర్శనం అని వినోద్ కుమార్ అన్నారు. ఈ మేరకు వినోద్ కుమార్ కేంద్ర నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌కు రీ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News