- Advertisement -
బ్యాటరీ స్వాపింగ్ ముసాయిదా విడుదల
న్యూఢిల్లీ : ప్రభుత్వ సంవిధానాల ఆలోచనల వేదిక నీతి ఆయోగ్ గురువారం అత్యంత కీలకమైన బ్యాటరీ స్వాపింగ్ పాలసీ ముసాయిదాను విడుదల చేసింది. దీని పరిధిలో దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాలో అంటే 40 లక్షల జనాభాను మించిన సిటీలలో తొలిదశలో బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్ రూపకల్పనకు ప్రాధాన్యతను ఇస్తారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర ప్రధాన నగరాలలో , యుటి ప్రధాన కేంద్రాలలో రెండో దశ పరిధిలో ఈ పాలసీని వర్తింపచేస్తారు. ఎదుగుతున్న నగరాలలో ద్వి త్రిచక్ర వాహనాల కేటగిరి వాడక ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుంటారు.
- Advertisement -